Monday, 7 September 2015

తెలంగాణకు వ్యాపించిన సూదిగాళ్లు

 

ఏపీని హడలెత్తిస్తున్న ఇంజెక్షన్ సైకోలు, తెలంగాణ కు కూడా పాకారు. తాజాగా ఈ రోజు నల్గొండ జిల్లాలో తమ ప్రతాపం చూపి, జనాలను ఉలిక్కి పడేలా చేశారు. వివరాల్లోకి వెళ్తే, కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో బైక్ పై వెళ్తున్న రైతు వీరయ్యకు సూది గుచ్చిన ముగ్గురు ఆగంతుకులు ఆటోలో పరారయ్యారు. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఇంజెక్షన్ సైకోల దాడులు హైదరాబాదుకు కూడా పాకడం కలకలం రేపుతోంది. ఎల్బీనగర్ లో ఈరోజు సైకో దాడి జరిగింది. ఎల్ఐసీ ఆర్ఎంగా పని చేస్తున్న స్వామి నాయక్ అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తుండగా ఓ దుండగుడు సూదితో పొడిచి పరారయ్యాడు. అనంతరం, స్వామి నాయక్ ను వైద్య పరీక్షల నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Good News For Telangana Farmers

 


తెలంగాణ రైతన్నలకు శుభవార్త

తెలంగాణ వ్యవసాయదారులకు శుభవార్త. సున్నా శాతం వడ్డీతో వ్యవసాయ రుణాలను రెన్యువల్ చేయాలని లేఖలో సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో పలుమార్లు చర్చలు జరిపారు. అయిన బ్యాంకులు మాత్రం రైతుల నుంచి ఇప్పటికీ వడ్డీలు వసూలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో లక్ష రూపాయల్లోపు క్రాప్ లోన్ తీసుకున్న రైతుల నుంచి వడ్డీ వసూలు చేయరాదని తెలంగాణ బ్యాంకులకు ఎస్ఎల్ బీసీ ఛైర్మన్ శంతన్ ముఖర్జీ లేఖ రాశారు. 


New Governor

 

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కేంద్రం తప్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడ అందుకు అవునన్నట్లుగానే ఉన్నాయి. గత నెల 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో ‘ఎట్ హోం’ పేరిట నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులిద్దరూ హాజరు కాలేదు. దీంతో మనసు నొచ్చుకున్న నరసింహన్ తనను ఈ బాధ్యతలను తొలగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవైపు నరసింహన్ అన్ని అంశాల్లో తెలంగాణ వైపు మొగ్గుచూపుతున్నారని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తూ పదేపదే గవర్నర్ ను మార్చాలని పట్టుబడుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలన్నీ పరిష్కారం కావాలని, ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరాలని కేంద్రం భావిస్తోంది. ఇది జరగాలంటే న్యాయపరమైన అంశాలపై పట్టు ఉన్న వ్యక్తులైతే బాగుంటుందని కేంద్రం యోచిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుతం కేరళ గవర్నర్ గా పనిచేస్తున్న జస్టిస్ సదాశివం అయితే సరిగ్గా సరిపోతారని కూడా కేంద్రం పెద్దలు భావిస్తున్నారు. ఈ కారణాలన్నింటి నేపథ్యంలో నరసింహన్ స్థానంలో జస్టిస్ సదాశివంను నియమించే దిశగా కేంద్రం ఆలోచన పరుగులు తీస్తుంది.

ముంబయి కోర్టు తీర్పుతో సీఎంకు ఊరట

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబయి కోర్టు కేసు తీర్పుతో ఊరట లభించింది. అయితే గత ఎన్నికలలో మహారాష్ట్ర సీఎం మహారాష్ట్రలో ధన్ గార్ గా పిలువబడే పశువుల కాపర్లకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని, ఆ హామీని ఆయన నిలబెట్టుకోలేదంటూ హేంత్ పాటిల్ అనే బీఎస్పీ కార్యకర్త ఒకరు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే పశువుల కాపర్లకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా విషయంలో మహారాష్ట్ర సీఎం మోసగించిందేమీ లేదంటూ బారామతిలోని ఓ కోర్టు జడ్జి తెలియజేసింది. ఈ కేసు విచారణకు జడ్జి అంగీకరించలేదు.

గద్దలు ఎలా కనుమరుగైయ్యయో తెలుసా…

 

గద్దలు అంటే ఏమిటి అమ్మ అని చిన్న పిల్లలు తమ తల్లిని అడుగుతున్నారంటే ఇంక ఇంతకన్న హీనమైది ఏమున్నది చెప్పండి. ఎందుకంటే ప్రస్తుత్తం గద్దలు కనుమరుగైపోయ్యాయి. ఈ విషయం అందరికి తెలుసు. కానీ అవి ఎలా కనుమరుగైయ్యాయి అంటే దాదాపుగా ఎవరికి తెలియదు. అందరికి తెలియని నిజం ఏమిటంటే….ప్రస్తుత్తం మనం వాడుతున్న సెల్ టవర్ల ప్రభావమే వాటి కనుమరుగుకు కారణం అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఇది నిజం. ఎలా అంటే మనం వాడుతున్న సెల్ కు సిగ్నల్ గా టవర్లలను వాడుతున్నాం. వాటి రేడియోషన్ వల్లే ఇవి మరణిస్తున్నాయి అని తాజా అధ్యయనంలో అని తెలింది. ఈ ఫోటోలు చూసి ఆ గద్దల చూపుల్లో అర్థం మీరే గ్రహించండి. ఆకాశమే హద్దుగా ఎగిరిన మా పక్షుల గుంపులు ఎక్కడ అని వాటి చూపులు, అరుపులు. ఒక్కప్పుడు మేము అరణ్యంలోకి వెళ్ళితే ఏ చెట్టుపైన అయిన వాలిపోయే వాళ్లం. కానీ ఇప్పుడు వన్యసంపద అంతరించి, చివరకు మేము గుడులు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నాం. కోత్తగా వచ్చిన సెల్ టవర్లలను మా నివసాలు అనుకున్నాం. కాని వాటి ప్రభావం చివరకు మా పక్షిజాతి అంతనికి పరాష్టగా మారిపోయాయి. ఒక్కప్పుడు గద్దలు అదిగో ఆకాశంలో ఎగురుతున్నాయి అని చూపించేవారు. కానీ ఇప్పుడు ఫోటోలో చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. నింగి వైపు దూసూకుపోయే వాళ్లం ఒక్కప్పుడు ఇప్పుడు తోడు లేక క్రూంగ్రిపోతున్నాం. దయచేసి మా పక్షిజాతులు కనుమరుగైయ్యే విధంగా మీ ప్రయోగాలు మాని పక్షిజాతులు పూర్వవైభవన్ని సంతరించుకునే విధంగా ప్రయత్నించండి…ఫ్లీజ్..

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో జాబ్స్

 

తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (హైదరాబాద్)లో ఖాళీగా వున్న SMO, MO, స్టాఫ్ నర్స్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
1. Sr. Medical Officer
2. Medical Officer
3. Counselor
4. Data Manager
5. Staff Nurse
6. Lab Technician
7. Pharmacist
8. Care Co-ordinator
విద్యార్హత : MD/ MBBS/ Masters Degree in Social Work/ Degree (Sociology)/ Degree with Diploma in Compute Application/ General Nursing (GNM)/ B.Sc. Nursing/ ANM/ Degree/ Diploma in Medical Laboratory Technology/ Diploma in Pharmacy/ Intermediate.
చివరి తేదీ : 10.09.2015.

తెలంగాణ జాగృతిలో ట్రెయినర్లు

 

తెలంగాణ జాగృతి (టీజీ) స్కిల్స్ విభాగంలో ట్రెయినర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు………
ట్రెయినర్
విభాగాలు: కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, ఐటీ-ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ, రిటెయిల్, అగ్రికల్చర్, బీఎఫ్ఎస్ఐ, కన్‌స్ట్రక్షన్, మీడియా అండ్ ఎంటర్‌టెయిన్‌మెంట్, టెక్స్‌టైల్, లైఫ్ సైన్సెస్, బ్యూటీ అండ్ వెల్‌నెస్, అప్పెరల్, ఆటోమోటివ్, ప్లంబింగ్, హెల్త్, టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ, జెమ్ అండ్ జ్యువెలరీ, మైనింగ్.
అర్హతలు: ఏదైనా డిగ్రీ/ డిప్లొమా/ ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా.
చివరితేది: సెప్టెంబరు 13
hr.jagruthi@gmail.com