బాహుబలి-2 కోసం ఎదురుచూస్తున్నా : విద్యాబాలన్
డర్టీ పిక్చర్’ సినిమా పెద్దహిట్ కావడంతో మంచి పేరు సంపాదించుకుంది నటి
విద్యాబాలన్. ఆ సినిమా రాకముందు విద్యాబాలన్ అంటేనే ఎవరో తెలియదు. అలాంటి
స్థితిలో ఉన్న విద్యాబాలన్ కు ‘డర్టీ పిక్చర్’ చిత్రం మంచి క్రేజ్
తెచ్చింది. తాను బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోను తన నటనతో
ప్రేక్షకులను అలరిస్తాన్నాని అంటోంది ఈ బ్యూటీ. చిన్నప్పుడు తన మామ
హైదరాబాదులో ఉండేవారని, అప్పుడు గోల్కొండ కోటను చూశానని విద్యాబాలన్
చెప్పింది. బాహుబలి, మగధీర సినిమాలు చూశానని చెప్పిన విద్యాబాలన్, మంచి
స్క్రిప్టు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. గతంలో తెలుగు
సినిమాల్లో చేయమని పలు అవకాశాలు వచ్చాయని, అయితే పలు కారణాలతో వాటిలో
నటించలేదని విద్యాబాలన్ చెప్పింది. మలయాళం, తెలుగు సినిమాల్లో నటించాలని
ఉండేదని విద్యాబాలన్ తెలియజేసింది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న బాహుబలి
రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె ఈ సందర్బంగా తెలిపింది.
No comments:
Post a Comment