మళ్లీ పెళ్లి కోడుకైన డిగ్గి రాజా…
గత కోంత కాలంగా సహజీవనం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్
సింగ్, అమృతారాయ్ లు ఎట్టకేలకు పెళ్లి పిటలెక్కారు. ఈ వివాహం గత నెలలో
జరిగింది. రాజ్యసభ టీవీ యాంకర్ అయిన అమృతారాయ్ దిగ్విజయ్ ల మధ్య సహజీవనం
విషయం గత ఏడాది ఏప్రిల్‌లో బయటకు వచ్చింది. 44 సంవత్సరాల రాయ్‌కు గతంలోనే
వివాహం జరిగింది. విడాకుల తర్వాత ఆమె దిగ్విజయ్‌ను వివాహం చేసుకుంటానని
గతంలోనే ప్రకటించారు. అలాగే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం దిగ్విజయ్
సింగ్ అమెరికాలో ఉన్నారు. అమృతారాయ్ కూడా లీవ్‌లో ఉన్నారు. దిగ్విజయ్ సింగ్
భార్య 2013లో సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూశారు. 68 ఏళ్ల దిగ్విజయ్
సింగ్‌కు నలుగురు కుమార్తెలు ఒక కుమారుడున్నారు.
No comments:
Post a Comment