Monday, 7 September 2015
రైతులు నక్సలైట్లుగా మారతారు
రైతుల ఆత్మహత్యల పట్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ మట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సంక్షోభంతో ప్రమాదకర పర్యవసానాలు ఎదురుకావచ్చని హెచ్చరించారు. ‘రైతులు తమ ప్రాణాలు తామే తీసుకోగల్గినప్పుడు ఇతరుల ప్రాణాలూ తీయగలరు. విప్లవ ఆలోచన సాగితే రైతులు నక్సలైట్లు కాగలరు’ అని పటేకర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని లాతూరు, ఉస్మానాబాద్ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఒక్క కుటుంబానికి రూ. 15వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. అంతేగాక, వారంతాల్లో మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘రైతులు మరణిస్తుంటే చూస్తూ ఇంట్లో కూర్చోలేను. మరణించిన రైతుల భార్యలు వందలమంది ఇలా చెక్కుల కోసం ఎదురుచూడటం ఎంత బాధాకరమో ఆలోచించండి. నాకు కష్టమనిపించింది, ఇంత కంటే అవమానకరం మరేదీ ఉండదు’ అని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment