పిడుగు దెబ్బకు 24 మంది మృతి
నిన్న కురిసిన వచ్చిపడ్డ భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ లో పెను విషాదాన్ని
మిగిల్చాయి. పిడుగుపాటుకు గురై ఏకంగా 24 మంది మృత్యువాత పడ్డారు.
నెల్లూరులో ఏడుగురు.. కృష్ణాలో ఆరుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరు
జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలో
ఒక్కరు చొప్పున మృతి చెందినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పిడుగుల
బీభత్సంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీలో
కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి రెండుసార్లు
సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల
కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని
వాతావరణ శాఖ తెలిపింది.
No comments:
Post a Comment