Thursday, 3 September 2015

‘రోబో 2’ మూవీ ఫ్యాన్స్‌కు షాక్

 

సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం యువ ద‌ర్శ‌కుడు రంజిత్ డైరెక్ష‌న్‌లో క‌బాలి సినిమాలో న‌టిస్తున్నాడు. ఇది కేవ‌లం 40 రోజుల్లోనే పూర్తి కానుంది. శంకర్ దర్శకత్వం లో రాబోతున్న ‘రోబో 2’ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో పూర్తి చేసుకోని ప‌ట్టాలెక్కే డేట్ ఖ‌రారు అయినట్లు తెలుస్తుంది. శంకర్ దర్శకత్వం లో రోబో 2 ఎప్పుడు మొదలవుతోందనే దానికి స‌రైన స‌మాధానం లేదు. మెగాస్టార్ చిరంజీవి 150వ ప్రాజెక్టులానే ఈ సినిమా కూడా వాయిదాల ముందుకు వెళుతోంది. రోబో 2 రచయిత బి.జ‌య మోహన్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం స్క్రిప్టు ఫైనల్ అయ్యింది. ఈ సీక్వెల్ 2010 లో రిలీజైన రోబోకి కంటిన్యూషన్ పార్ట్. కథ ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడి నుంచే రోబో 2 కథ మొదలవుతుందని తెలిపాడు. 2015 చివరిలో సెట్స్ కెళుతోంది. 2016 జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంద‌ని అనుకున్నా…ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తూ ఈ సంవ‌త్స‌రం సెట్స్‌పైకి వెళుతుంద‌నే సమాచారం తెలుస్తోంది. మ‌రో విశేషం ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ దశలోనే శంక‌ర్ రోబో 2 విజువల్ ఎఫెక్ట్స్ పై కూడా వర్క్ చేయనున్నారు. రోబో త‌ర్వాత స్నేహితుడు, ఐ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోవ‌డంతో శంక‌ర్ క‌సితో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.

No comments:

Post a Comment