Shocking images of drowned Syrian boy show tragic plight of refugees
Very Sad......
సిరియాలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఆక్రమించిన కొబానే నగరం నుంచి అబ్దుల్లా
కుర్దీ అనే వ్యక్తి తన భార్య రెహాన్, కుమారులు గాలిప్, అయలన్ కుర్దీ లను
తీసుకొని యూరప్‌కు పయనమయ్యారు. చిన్న పడవలో 17 మందితో కలిసి వెళ్తుండగా
బోడ్రమ్ సమీపంలో మధ్యధరా సముద్రంలో రెండురోజుల క్రితం అర్ధరాత్రి ఆ పడవ
మునిగిపోయింది. భార్యా పిల్లలకు లైఫ్ జాకెట్లు లేకపోవటంతో వారు అలల
తాకిడికి కొట్టుకుపోయారు.
వారిని రక్షించుకోవాలని అబ్దుల్లా ఎంతగా
ప్రయత్నించినా సాధ్యపడలేదు. లైఫ్ జాకెట్ ధరించిన అతడు మాత్రం ప్రాణాలతో
బయటపడ్డారు. సముద్రంలో మునిగిపోయిన అయిలన్ బుధవారం బోడ్రమ్ తీరానికి శవంగా
మారి కొట్టుకువచ్చిన దృశ్యం యావత్ ప్రపంచాన్ని కలచివేస్తున్నది. దింతో
సిరియా సిరియా శరణార్థుల హృదయవిదారక భాద మనకు అవగతం అవుతుంది. పడవ
ప్రమాదంలో చనిపోయిన మూడేండ్ల పసిబాలుడి మృతదేహం టర్కీలోని బోడ్రమ్ తీరానికి
కొట్టుకొచ్చిన తర్వాత ఆ బాలుడి మృతదేహాన్ని స్థానిక అధికారి ఒకరు చేతుల్లో
పట్టుకొన్ని తరలిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా
మారింది.
Aylan Kurdi picc: Syrian child drowned in the Aegean Sea in Turkey
No comments:
Post a Comment