గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నమాజీ సీఎం…..?
ఏ ప్రభుత్వం వచ్చినా గ్యాస్ సబ్సిడీని అందించేది మాత్రం సామాన్య ప్రజలను
దృష్టిలో ఉంచుకునే,కానీ ఓ ప్రజాప్రతినిధి. ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్
పార్టీకి అధినేతగా ఉన్న వ్యక్తి. సామాన్య ప్రజానీకానికి ఆదర్శంగా
నిలువాల్సిన వ్యక్తే సామన్య వ్యక్తిలాగా గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు
చేసుకున్నాడు. ఆయనే జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్‌అబ్ధుల్లా. ఫరూఖ్ గత
నెలలో ఓ హెచ్‌పీ గ్యాస్ డీలర్ వద్ద ఆధార్ లేకుండా గ్యాస్ సబ్సిడీకి
దరఖాస్తు చేసుకున్నాడు. ఫరూఖ్ వ్యవహారంపై మండిపడుతున్న అధికార పార్టీ కి
చెందిన సభ్యులు ఫరూఖ్ గ్యాస్ సబ్సిడీ తీసుకునేంత పేదవాడైతే ప్రభుత్వమే
అతనికి ఆరేళ్లపాటు ఉచిత గ్యాస్ ను అందిస్తుందని తెలిపారు. 2014 సాధారణ
ఎన్నికల సమయంలో ఫరూఖ్ ఎన్నికల అఫిడవిట్ పేర్కొన్న ఆస్తుల విలువ 13
కోట్లు.కాగా గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవడం వింతగా తోచింది
అందరికి..
No comments:
Post a Comment