LIP LOCK SCENE REJECTED ACTOR NANI WIFE
లిప్ లాక్ సీన్లలో నటిస్తు హీరోలకు ఇంటిపోరు ఎక్కువైపోతుంది. దీనితో లిప్
లాక్ సీన్లలో నటించడానికి హీరోలు జంకుతున్నారు. ఎందుకుహీరోలు లిప్ లాక్
సీన్లు చేయటానికి ఇష్టపడటం లేదంటే ….రొమాంటిక్ సీన్లు కాపురాలు
కూలుస్తున్నాయని స్వయానా హీరోలే చెబుతున్నారు. సెప్టెంబర్ 4న విడుదల
కానున్న భలే భలే మగాడివోయ్ సినిమా ప్రమోషన్ లో ఈ విషయాన్ని హీరో నాని
బయటపెట్టాడు. లిప్ లాక్ సీన్ చేయడానికి తన భార్య ఒప్పుకోవడం లేదని
స్పష్టం చేశాడు.
అహ నా కల్యాణం సినిమాలో లిప్ లాక్ సీన్ చూసి తన భార్య కోపగించుకుందని ఆ
టార్చర్ ఇక జీవితంలో భరించకూడదనే ఉద్దేశ్యంతో తన సినిమాల్లో లిప్ లాక్
సీన్లు ఉండకూడదని దర్శక-నిర్మాతలకు చెప్పేశాడట నాని.
కేవలం నాని మాత్రమే కాదు అల్లు అర్జున్ కూడా లిప్ లాక్ సీన్లు ఉండకూడదని
చెప్పాడట. సెంటిమెంట్ అని బయటకు కలరింగ్ ఇస్తున్నా అసలు విషయం భార్య
స్నేహారెడ్డి గట్టిగా క్లాస్ పీకిందట. అందుకే ఈ కుర్రహీరో కూడా నో లిప్
లాక్ సీన్లు అంటున్నారు.
No comments:
Post a Comment