Thursday, 10 September 2015

స్వచ్చ భారత్ అంబాసిడర్లకు తేనీటి విందు

 

కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా స్వచ్ఛ భారత్ అంబాసిడర్లకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తేనీటి విందు ఇచ్చారు. ఈ విందు కార్యక్రమానికి సినీ రంగం నుంచి కమల్‌హాసన్,శంకర్‌మహదేవన్, క్రికెటర్లు సురేశ్‌రైనా, మహ్మద్ కైఫ్,సచిన్ టెండూల్కర్, యోగా గురువు రాందేవ్ బాబా, యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్, అమల అక్కినేని, తమన్నా శశిథరూర్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, రామోజీరావుతోపాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సంధర్బంగా వెంకయ్య నాయుడు మాట్లడూతు స్వచ్చ భారత్ లో పేరు ప్రఖ్యాతలు ఉన్న వారందరూ పాల్గోంటున్నారని కానీ దేశ ప్రజల తీరు ఎలా ఉందంటే సబ్ కామ్ గవర్నమెంట్ కరేగా… హమ్ బేకార్ బైఠేగా (మొత్తం పనంతా గవర్నమెంటే చేస్తుంది…మనం తీరిగ్గా కూర్చుందాం) అన్నట్టు ఉందని ఆయన మండిపడ్డారు. ప్రజల భాగస్వమ్యం లేనిదే ఏ కార్యక్రమమూ విజయవంతం కాదని ఆయన స్పష్టం చేశారు. మన దేశాన్ని మనమే శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు.

No comments:

Post a Comment