ఏ క్షణంలోనైనా దావూద్ ఫినిష్ చేస్తాం : కేంద్ర మంత్రి
పాకిస్ధాన్ లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఏ
క్షణంలోనైనా మట్టుబెట్టడం ఖాయమని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రి
రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఓ టీవీ ఛానెల్ కు
ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఈ ప్రకటన చేశారు. భారత్ తన శత్రువుల పట్ల
ఎంతమాత్రం నిర్లక్ష్యం వహించబోదని, కోవర్ట్ లేదా ప్రత్యేక ఆపరేషన్ ద్వారా
దావూద్ ఇబ్రహీంను మట్టుబెడతామని ఆయన అన్నారు. 1993 ముంబై పేలుళ్ల ఘటనలో
ప్రధాని నిందితుడైన దావూద్ ఇబ్రహీంపై మిలిటరీ ఆపరేషన్ ఎందుకు కొనసాగించడం
లేదని అడిగిన ప్రశ్నకు.. కోవర్ట్ ఆపరేషన్ వేస్తే దాని విషయాలు బయటకు
తెలియవని, ప్రత్యేక ఆపరేషన్ నే చేపడతామని ఆయన ప్రకటించారు. ‘‘సామ, దాన,
భేద, దండోపాయాలల్లో కొన్నింటిని దావూద్ పై ఇప్పటికే
ప్రయోగించాం,మరికొన్నింటినీ త్వరలోనే ప్రయోగిస్తాం. దావూద్ పాకిస్థాన్ లో
స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ అతడి ప్రతి కదలికపై మాకు పూర్తి సమాచారం
ఉంది. ప్రభుత్వ నిర్ణయమే తరువాయి, ఏదో ఒక సందర్భంగా దావూద్ పని
ముగించేస్తాం” అని రాథోడ్ వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment