Sunday, 6 September 2015

ఖరారైన నూతన మద్యం పాలసీ

 

నూతన ఎక్సైజ్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. సచివాయంలో సీఎం కేసీఆర్ మద్యం విధానంపై సమీక్ష నిర్వహించారు. పాత ఎక్సైజ్‌ పాలసీనే అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. పాలసీ కాల పరిమితిని మాత్రం పొడిగించింది. నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించాలని సీఎం సూచించారు. ఒకవేళ దరఖాస్తులు ఎక్కువగా వస్తే లాటరీ పద్ధతి ద్వారా లైసెన్సులు ఖరారు చేయాలని నిర్ణయించారు. ఏడాది పాటే అమల్లో ఉన్న ఎక్సైజ్‌ పాలసీని ఇకనుండి రెండేళ్ల కాలపరిమితితో ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఏడాదికి 10 శాతం చొప్పున రెండేళ్లకు 20 శాతం మేర లైసెన్సు ఫీజులను పెంచడానికి రంగం సిద్ధం చేసింది. ఈమేరకు సీఎం కేసీఆర్‌ ఆదివారం పాలసీ ఫైలుపై సంతకం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి టి.పద్మారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ మిశ్రా, కమిషనర్‌ ఆర్వీ చంద్రవదన్‌ తదితరులతో ఎక్సైజ్‌ పాలసీపై సీఎం సమీక్షించారు.

No comments:

Post a Comment