Rape Case On MLA Gopinath Das
అస్సాం ప్రతిపక్ష ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్ పై రేప్ కేసు నమోదు
చేశారు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే తనను గత నెల 29న రేప్ చేశాడంటూ 14
ఏళ్ల బాలిక మందిరా ఔట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే గోపీనాథ్ దాస్
గౌహతి నగరంలో ఆయన కారులోనే తనపై అత్యాచారం చేశాడని బాలిక తన ఫిర్యాదులో
పేర్కొంది. బాలిక ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ
విషయంలో నేరస్థులు ఎవరైనా వదిలేది లేదని, చట్టం తనపని తాను చేసుకు
పోతుందని పోలీసులు తెలిపారు.
గోపీనాథ్ దాస్ అస్సాంలోని బోకో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా
ఎన్నికయ్యాడు. అయితే, తన ఇంట్లో పనిమనిషి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే
గోపీనాథ్ దాస్ ఖండించారు. ఇదంతా తనపై చేసిన కుట్ర అని, ఇది తప్పుడు కేసేనని
తెలిపారు. బాలిక ఆరోపణలలో వాస్తవం ఎంతన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు.
కొన్ని రోజుల క్రితం ఆమె తన ఇంటి నుంచి కొన్ని వస్తువులు తీసుకుని
పారిపోయిందని ఆరోపించారు. ఎమ్మెల్యే అత్యాచార ఆరోపణల విషయం తెలుసుకున్న
మహిళా సంఘాలు, అస్సాం స్టూడెంట్స్ యూనియన్, వివిధ విద్యార్ధి సంఘాలు నేతలు
ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని ఆందోళన నిర్వహించారు.
No comments:
Post a Comment