Wednesday, 2 September 2015

బాబాయ్ పుట్టినరోజుకు ‘బ్రూస్ లీ’ టీజర్

 

గోవిందుడు అందరివాడేలే’ తర్వాత రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ’. ‘ది ఫైటర్’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ… ‘బ్రూస్ లీ’ కొత్త ట్రైలర్ ను విడుదల చేసారు.
ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ను బాగా చూపించనున్నారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ చాలా బాగుంది. ఇందులో చరణ్ చాలా స్టైలిష్ గా, లుక్స్ పరంగా అదరగొడుతున్నాడు. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా తెరకెక్కుతోంది. కమర్షియల్ యాక్షన్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది.
ప్రముఖ కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో హిట్ చిత్రాల నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు. చరణ్ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా జతకడుతుంది.
చరణ్ ఓ స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 80% పూర్తి చేసుకున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్; లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్, సమర్పణ : డి. పార్వతి, నిర్మాత : దానయ్య డి.వి.వి, దర్శకత్వం: శ్రీనువైట్ల.

No comments:

Post a Comment