Sunday, 6 September 2015

కక్ష్యలోకి చేరిన జిశాట్-6

 

సమాచార ఉపగ్రహం జిశాట్‌-6 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. తన తూర్పు 83 డిగ్రీల కక్ష్య స్లాట్‌లో జిశాట్‌-6 ప్రవేశించిందని, ఇన్‌శాట్‌ 4ఏ, జిశాట్‌ 12, జిశాట్‌ 10, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌1సితో ఆదివారం ఉదయం క్రమపద్ధతిలో అమరుతోందని ఆ ప్రకటన తెలిపింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్రయోజెనిక్‌ ఇంజన్‌ సహాయంతో ఆగస్టు 27న శ్రీహరికోట నుంచి జిశాట్‌-6ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇది తోమ్మిది సంవత్సరాలు తన సేవలను అందించనుంది.

No comments:

Post a Comment