Dhoni and Sehwag will play Together
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర
సెహ్వాగ్‌లు చాలా రోజుల తర్వాత జట్టుగా కలిసి ఆడనున్నారు. ప్రతి ఏటా లండన్
లో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తుంది. ఈ మ్యాచ్
ఇంగ్లండ్ వేదికగా ఈ నెల 17న జరిగే ఈ టీ20 మ్యాచ్‌లో ఆడనున్నారు.
ఆండ్రూస్ట్రాస్ సారథ్యంలోని హెల్ఫ్ హీరోస్ ఎలెవన్ తరఫున ఆడే జట్టులో ధోనీ,
సెహ్వాగ్‌లతో పాటు అఫ్రిది (పాక్), గిబ్స్ (సౌతాఫ్రికా)లాంటి స్టార్లు
కనిపిస్తారు. ఈ మ్యాచ్ నిర్వహణ బాధ్యతలను ఈసీబీ డైరెక్టర్ ఆండ్ర్యూ
నిర్వహిస్తుండగా, గవాస్కర్ కూడా నిర్వహణలో పాలుపంచుకోనున్నారు. అయితే,
అంతర్జాతీయ స్టార్లతో కలిసి మ్యాచ్ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉందని ధోనీ
అన్నాడు. ఓ మంచి ఆశయం కోసం జరుగుతున్న మ్యాచ్ కు అందరూ మద్దతివ్వాలని
టీమిండియా కెప్టెన్ ధోనీ కోరాడు.
Dhoni and Sehwag will play Together
No comments:
Post a Comment