Thursday, 27 August 2015

సైకో సమాచారం ఇస్తే 50 వేల రివార్డు

 

పశ్చిమ గోదావరి జిల్లాలో గత కోత కాలంగా ఓ సైకో సిరంజితో దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడే సైకో ను పట్టుకునేందకు పోలీసులు 40 టీమ్ లను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన సూది దాడులకు పాల్పడే వ్యక్తి ఒక్కరా, లేక ముఠా సభ్యులుగా ఉన్నరా.. అనే విషయాలు విచారణలో బయటపడాల్సి ఉందన్నారు. సూదితో దాడి చేయడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు రావని, ఆ సూదిలో ఏవిధమైన కెమికల్స్ లేవని ప్రాధమికంగా అంచనా వేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఎవరైనా నిందితుని సంబందించిన విలువైన సమాచారం ఇస్తే వారికి 50 వేల రూపాయలు రివార్డు ఇస్తామంటున్నారు పోలీసులు. ఇప్పటికి 9మంది పిర్యాదు చేశారని, అయితే బాదితులు ఇచ్చిన సమాచారంతో నిందితుని అతి త్వరలోనే పట్టుకుంటామంటున్నారు. ఈ దాడుల వల్ల ఆడవారు బయటికి రావడానికి భయ పడుతున్నారు.

No comments:

Post a Comment