సర్దార్ లో పవన్ విలన్ ఎవరంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూడో
షెడ్యూల్ త్వరలో ఆరంభంకానున్న విషయం తెలిసిందే. ‘పవర్’ ఫేం బాబి
దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా
నటిస్తోంది. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్ గా నటించాడు
అభిమన్యుసింగ్. తాజాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం విలన్ ని ఫిక్స్
చేసారని తెలుస్తోంది. ఆ విలన్ ఎవరంటే…
గోపీచంద్ హీరోగా రూపొందిన ‘జిల్’ చిత్రంలో ఛోటా నాయక్ పాత్ర చేసిన విలన్
పాత్రధారి, ఇండియన్ మోడల్ కబీర్ దూహన్ సింగ్ తెలుగు ఆడియన్స్ కి విపరీతంగా
నచ్చేసాడు. మంచి ఫిజిక్, రఫ్ లుక్ తో చూడచక్కగా ఉన్న కబీర్ కి టాలీవుడ్ లో
మంచి భవిష్యత్తు ఉంటుందని ‘జిల్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అన్నారు. ఇటీవల
విడుదలైన ‘కిక్ 2’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. కోలీవుడ్
లో అజిత్ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా
‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్ గా నటించే అవకాశం కబీర్ కి
దక్కింది. ఈ అవకాశం పట్ల కబీర్ ఫుల్ ఖుషీగా ఉన్నాడట. పవన్ కళ్యాణ్ సినిమాలో
నటించాలనేది కబీర్ కోరికట. తను తెలుగు ఇండస్ర్టీకి పరిచయం అయిన అతి కొద్ది
కాలంలోనే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో నటించే అవకాశం రావడం పట్ల ఫుల్
ఖుషీగా ఉన్నాడట కబీర్. మూడో షెడ్యూల్ నుంచి కబీర్ ఈ ‘సర్దార్ గబ్బర్ సింగ్’
షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని సమాచారమ్.
No comments:
Post a Comment