Wednesday, 26 August 2015

హీరోయిన్ గా క్రేజ్ రావాలంటే ఎక్స్ పోజింగ్ బేటరంట..



బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీ సోనాల్ చౌహాన్ అక్కడ గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్ కు వచ్చేసింది. తెలుగులో తొలిచిత్రం పరాజయాన్నే మిగిల్చింది. తర్వాత బాలయ్య సరసన లెజెండ్ చిత్రంలో నటించాక ఈ అమ్మడు ఫుల్ బిజీ అయింది. సోనాల్ నటించిన షేర్, సైజ్ జీరో చిత్రాలు విడుదల సన్నాహాల్లో ఉండగా.. మరోసారి బాలయ్యతో కలసి నటిస్తున్న డిక్టేటర్ సినిమా సెట్స్ పై ఉంది. నటనలో పెద్దగా మెప్పించక పోయినప్పటికీ.. సోనాల్ కు తెలుగులో అవకాశాలు మాత్రం ఎక్కువే వస్తున్నాయి. ఈ అవకాశాల వెనకున్న అసలు సీక్రెట్ ను కూడా తానే ఇటీవల రివీల్ చేసిందట ఈ సెక్సీ బ్యూటీ. యాక్టింగ్ విషయంలో అమ్మడికి తక్కువ మార్కులే పడుతున్నా.. ఎక్స్ పోజింగ్ లో మాత్రం వందకు వంద మార్కులు పడేలా ట్రై చేస్తోంది సోనాల్. ఇప్పటివరకూ తెలుగులో సోనాల్ నటించిన సినిమాలే ఇందుకు నిదర్శనం. హీరోయిన్ గా క్రేజ్ రావాలంటే ఆ మాత్రం ఎక్స్ పోజింగ్ కంపల్సరీ అంటోందట ఢిల్లీ బ్యూటీ సోనాల్. అందాలున్నవి ప్రదర్శించడానికే కానీ.. దాచుకోడానికి కాదనేది అమ్మడి అభిప్రాయమట. అందుకే అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తేనే, యూత్ లో హీరోయిన్స్ కు క్రేజ్ ఉంటుందని చెప్పింది. తాను ప్రస్తుతం అదే చేస్తున్నానని తన సీక్రెట్ అని చెప్పెసింది సోనాల్.

No comments:

Post a Comment