Bollywood Actor Sanjay Datt Has Released on Payroll
పుణె, ఆగస్టు 26: ముంబై
పేలుళ్ల కేసు లో పుణె ఎర్రవాడ జైలులో ఐదేండ్ల శి క్ష అనుభవిస్తున్న
సినీనటుడు సంజయ్‌దత్ 30 రోజుల పెరోల్‌పై బుధవారం సాయం త్రం విడుదలయ్యారు.
తన కూతురు ఇక్రా అనారోగ్యంతో బాధపడుతున్నదని, ఆమె సర్జరీ కోసం పెరోల్
మంజూరు చేయాలని సంజయ్‌దత్ చేసుకొన్న విజ్ఞప్తికి జైలు అధికారులు సానుకూలంగా
స్పందించారు.
కూతురు శస్త్ర చికిత్స కోసం సంజయ్‌దత్ పెరోల్‌కు
దరఖాస్తు చేసుకున్నారని, ఆయనకు డివిజినల్ కమిషనర్ 30 రోజుల పెరోల్‌ను
మంజూరు చేశారని జైలు అధికారి మిలింద్ కుర్లెకర్ తెలిపారు. కుటుంబంతో నూతన
సంవత్సర వేడుకల్ని జరుపుకునేందుకు గత డిసెంబర్‌లో పెరోల్ విడుదలైన సంజయ్..
14 రోజుల తర్వాత జనవరిలో తిరిగి ఎర్రవాడ జైలుకు చేరుకున్న సంగతి తెలిసిందే.
జైలు అధికారులు సంజయ్‌దత్ కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని
విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మరోసారి పెరోల్ మంజూరు కావడం
గమనార్హం.
No comments:
Post a Comment