Wednesday, 26 August 2015

Central Govt Has Give Special Package To Telangana State Srinivas Goud


తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందే : శ్రీనివాస్ గౌడ్

 తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమ రాష్ట్రానికి ప్యాకేజీ ఇవ్వకపోతే ఉద్యమం చేపడతామని తెలిపారు. మాకు పోరాటాలు కొత్త కాదని హెచ్చరించారు. విభజన చట్టం కేవలం ఏపీకే వర్తిస్తుందా? తెలంగాణకు వర్తించాదా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా, ఇవ్వకున్నా తమకు అభ్యంతరం లేదని మీడియా సమావేశంలో తెలియజేశారు. కేంద్రం ఏమాత్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఇతర పార్టీల నేతలు ఈ విషయంపై కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదని నిలదీశారు. కేవలం తెలంగాణ సర్కార్ పై ఆగ్రహలు వ్యక్తం చేయడం కాదు, కేంద్రం తెలంగాణను ఎందుకు పట్టించుకోవడం లేదనే దానిపై కూడా ఆలోచిస్తే మంచిదని సూచించారు.


No comments:

Post a Comment