Wednesday, 26 August 2015

Airforce jobs Air Man Recruitment Rally


భారత వాయుసేనలో ఎయిర్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని సెప్టెంబర్ 8 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ డీకే చౌదరి తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని పోలీస్ పేరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే రిక్రూట్‌మెంట్ ర్యాలీలో తెలంగాణ పది జిల్లాల పురుష అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు.

ఈ ర్యాలీలో గ్రూప్ ఎక్స్ విభాగంలో విద్యా శిక్షకుడు(ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్), గ్రూప్ వై విభాగంలో ఐఏఎఫ్ సెక్యూరిటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వచ్చే నెల 8 నుంచి 14 తేదీ వరకు ఇన్‌స్ట్రక్టర్, ఐఏఎఫ్ సెక్యూరిటీ పోస్టులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తామని, అన్నింటిలో పాసైన అభ్యర్థులందరికీ ధ్రువ పత్రాల పరిశీలన, రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లు, అనంతరం ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు.

Air Force Recruitment Rally

ఇన్‌స్ట్రక్టర్‌లుగా ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు వయసు ధ్రువపత్రం, పదో తరగతి నుంచి డిగ్రీ లేదా పీజీ వరకు సర్టిఫికెట్లు, రెండు సంవత్సరాల బోధన అనుభవం సర్టిఫికెట్ తీసుకురావాలని పేర్కొన్నారు. అలాగే, ఐఏఎఫ్ సెక్యూరిటీ ఉద్యోగాల కోసం వచ్చే వారు వయసు ధ్రువవపత్రం, పదో తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలని వివరించారు. పై రెండు పోస్టులకు పాల్గొనే అభ్యర్థులు 7 పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు, పరీక్ష రాసేందుకు హెచ్‌బీ పెన్సిల్, రబ్బర్, షార్ప్‌నర్, గమ్‌టేప్, స్టాప్లర్, బ్లూ, బ్లాక్ పెన్నులు తీసుకురావాలని సూచించారు.


ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్‌పై 30 నిమిషాల అబ్జెక్టీవ్ టైప్ రాత పరీక్ష ఉంటుంది. మరో 45 నిమిషాల పాటు డెస్క్రిప్టివ్ టైప్ లాంగ్వేజ్ కాంప్రెన్సీవ్, పవర్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌పై పరీక్ష నిర్వహిస్తారు. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టులో 8 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగు పందెం ఉంటుంది. పది పుషప్స్, సిటప్స్, 20 స్కాట్స్ టెస్ట్ నిర్వహిస్తారు.


ఐఏఎఫ్ సెక్యూరిటీ ఉద్యోగాలకు జనరల్ ఇంగ్లిష్ టైప్, రీజనింగ్ అవేర్‌నెస్‌లో రాత పరీక్ష ఉంటుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో 15నిమిషాల్లో 2.4 కిలో మీటర్ల పరుగుపందెం, పది పుషప్స్, షటప్స్, 20 స్కాట్స్ ఉంటాయి. వీటిలో పాసైన వారికి 30 నిమిషాల్లో 5 కిలోమీటర్ల పరుగుపందెం ఉంటుంది.


ఎడ్యుకేషనల్ ఇన్‌స్ట్రక్టర్‌కు అర్హతలు


ఏదేని డిగ్రీ, బీఈడీ, రెండు సంవత్సరాల బోధన అనుభవంతో పాటు 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి, లేదా ఎంఏ ఇంజనీరింగ్, ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, బీఈడీ, లేదా రెండు సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి. వయసు 1-8-1991 నుంచి 31-05-1996 మధ్య జన్మించిన వారు అర్హులు. మూడేళ్ల వయసు సడలింపు గలవారు 01-08-1988 నుంచి 31-5-1996 మధ్య జన్మించి ఉండాలి. వారికి శారీరక ప్రమాణాలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు, 5 సెంటీ మీటర్ల చాతి విస్తీర్ణత, ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండాలి.


ఐఏఎఫ్ సెక్యూరిటీ అర్హతలు


ఇంటర్, ఇంగ్లీషు 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి లేదా ఇంటర్ ఒకేషనల్, ఇంగ్లీషులో 50శాతం మార్కులతో పాసైన వారు అర్హులన్నారు. వీరికి వయస్సు 1-2-1996 నుంచి 31-5-1999 మధ్య జన్మించిన వారు అర్హులు. వీరికి శారీరక ప్రమాణాలు 152.5 సెంటీమీటర్ల ఎత్తు, 5 సెంటీమీటర్ల చాతీ విస్తీర్ణత, ఎత్తు వయసుకు తగ్గ బరువు ఉండాలి.

No comments:

Post a Comment