కూతురు పై మూడు రోజులుగా అత్యాచారం
కన్న కూతుళ్ల పై తండ్రే అత్యాచారాలకు పాల్పడుతున్న ఘనటనలు రోజురోజుకి
పెరిగిపోతున్నాయి.తాజాగా బంజారాహిల్స్ ఠాణాలో పరిధిలో కూతురిపై తండ్రి
అత్యాచారాలకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. ఎల్ఎన్‌నగర్
లో నివసించే సయ్యద్ రషీద్ పెయింటర్ గా పని చేస్తున్నాడు. అతని భార్యకు
కొంత కాలంగా ఆరోగ్యం సరిగా లేదు. అతని కుమార్తె స్థానికంగా ఓ పాఠశాలలో
తొమ్మిదో తరగతి చదువుతోంది. మూడు రోజుల క్రితం చిన్నారి పై అత్యాచారం
చేశాడు. విషయం బయటకు చెబితే చంపుతానంటూ బెదిరించాడు. రెండు రోజులుగా మరో
యువకుడితో సంబంధం ఉందంటూ కుమార్తెను కొడుతున్నాడు. తల్లి కుమార్తెను
దగ్గరకు తీసుకొని విచారించగా తండ్రి ఇప్పటికే రెండు సార్లు అత్యాచారానికి
పాల్పడ్డాడంటూ తెలియజేసింది. ఆమె భర్తను నిలదీసే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా
దాడిచేసేందుకు ప్రయత్నించాడు. చివరికి చిన్నారి పోలీసులను ఆశ్రయించి
ఫిర్యాదు చేయడంతో రషీద్‌ను అరెస్టు చేశారు. ఇతనిపై సెక్షన్ 376కింద కేసు
నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వివరించారు.
No comments:
Post a Comment