Friday, 28 August 2015

విక్రమ్ ప్రభుతో షామిలీ రొమాన్స్..!

 

బాలనటిగా మంచి పేరును దక్కించుకున్న బేబీ షామిలి… ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. షామిలి హీరోయిన్ గా ‘ఓయ్’ అనే ఒకే ఒక్క చిత్రంలో నటించింది. ఈ సినిమా తర్వాత షామిలి మరే ఇతర సినిమాల్లో నటించలేదు. అయితే ఇపుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది.

తమిళ యువ నటుడు విక్రమ్ ప్రభు హీరోగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి వీరశివాజీ అనే టైటిల్ ను నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇందులో హీరోయిన్ గా షామిలి నటించబోతున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం వరుస హిట్ చిత్రాలతో విక్రమ్ ప్రభు మంచి జోష్ మీదున్నాడు.

ఈ చిత్రానికి గణేష్ వినయన్ దర్శకత్వం వహించనున్నారు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. షామిలికి సంబంధించిన విషయాలను త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా షామిలికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. మరి తెలుగులో మళ్లీ ఏ సినిమాతో షామిలి రీ ఎంట్రీ ఇవ్వనుందో త్వరలోనే తెలియనున్నాయి.

 

No comments:

Post a Comment