ఐ’ సినిమా రికార్డు బ్రేక్ దిశగా ‘బాహుబలి’
ఐ’ సినిమా రికార్డు బ్రేక్ దిశగా ‘బాహుబలి’
తెలుగు చిత్రసీమలో బాహుబలి చిత్రం నెంబర్ వన్ చిత్రంగా నిలిచిపోయింది.
మాతృభాషలోనే కాకుండా తమిళభాషలో కూడా నెంబర్ వన్ స్థానం అక్రమించబోతుంది.
బాహుబలి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా తన హావకోనసాగిస్తుంది.
బాహుబలి సినిమా చెన్నై లోని మల్టీప్లెక్స్ లలో వీరవిహారం చేస్తోంది .
50రోజులకు చేరువైన బాహుబలి కేవలం చెన్నై లోని మల్టీప్లెక్స్ లలోనే దాదాపు
8కోట్ల వసూళ్ళ ని సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇప్పటికి కూడా
అన్ని మల్టీప్లెక్స్ లలో బాహుబలి హౌజ్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది.
విక్రం నటించిన ”ఐ ” చిత్రం మల్టీ ప్లెక్స్ లలో నెంబర్ వన్ గా ఉంది. అయితే
మరో వారం రోజుల్లోనే బాహుబలి ఐ రికార్డు ని బద్దలు కొట్టి నెంబర్ వన్ గా
నిలిచిపోనుంది. ఒక తెలుగు సినిమా తమిళనాట నెంబర్ వన్ కావడం నిజంగా
తెలుగుజాతికి గర్వకారణం అని చెప్పుకోవచ్చు.
No comments:
Post a Comment