Tomorrow (2nd September 2015) Buses and Auto Transport Bandh In Telangana State In Hyderabad
జాతీయ రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెతో
సెప్టెంబర్ 2న (బుధవారం) నగరంలో సిటీబస్సులు, ఆటోలు పూర్తిగా
నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా జరుగనున్న ఈ సమ్మెను నగరంలో విజయవంతం
చేసేందుకు మెజారిటీ ఆర్టీసీ, ఆటో కార్మిక సంఘాలు సన్నద్ధమయ్యాయి. దీంతో
గ్రేటర్ హైదరాబాద్ లోని 3,800 సిటీ బస్సులు, 1.20 లక్షలకు పైగా ఆటో
రిక్షాలు తిరిగే అవకాశం లేదు. ఆర్టీసీ ప్రధాన కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్
యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ లు సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలిపింది.
దీంతో రేపు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది.
సమ్మెకు ఆర్టీసీలోని వామపక్ష యూనియన్లతో పాటు తెలంగాణ మజ్దూర్ యూనియన్
తదితరాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన
కార్యదర్శి అశ్వథ్థామరెడ్డి ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గ్రేటర్‌లోని ఆటో
సంఘాల జేఏసీ, క్యాబ్స్ అసోసియేషన్ సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి.
ఒక్క భారతీయ మజ్దూర్ సంఘం మినహా అన్ని యూనియన్లు సమ్మెకు మద్దతు
ప్రకటించాయి. ఒక్కరోజు సమ్మె కావడంతో ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై
దృష్టి సారించలేదు. ఈ సమ్మెకు పలు విద్యుత్ యూనియన్లు, తెలంగాణ ఉద్యోగ
సంఘాలు మద్దతు ప్రకటించాయి. బుధవారం రోజున ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు
ధరించి, మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నాలు నిర్వహించాలని తెలంగాణ ఉద్యోగ
సంఘాల జేఏసీ పిలుపు నిచ్చింది. సమ్మెలో భాగంగా బాగ్ లింగంపల్లి సుందరయ్య
పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆటో సంఘాల
నేతలు బి.వెంకటేశ్, ఎ.సత్తిరెడ్డి, నరేందర్ తదితరులు తెలిపారు. ఆటో
కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని… ఈ చలానాలు
రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment