Hyderabad Shaan For Kakatiya Nishaan
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర సచివాలయం స్వాగత ద్వారం తెలంగాణ ప్రజల
ఆకాంక్షలకు, ఆలోచనలకు, సంస్కృతికి అద్దంపట్టేలా రూపుదిద్దుకోనుంది. నవాబుల
పాలన ఔన్నత్యంతోపాటు, కాకతీయుల రాజసం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు
ఉట్టిపడేలా నిర్మించనున్నారు. ప్రధాన ద్వారానికి ఇప్పటికే అనుమతులు
లభించినప్పటికీ కాకతీయ కళా తోరణంకోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీనికి
అనుమతులు రాగానే ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో పనులు చేపడుతారు. తెలంగాణ
రాష్ట్ర రాజముద్ర స్ఫురించేలా నిర్మిస్తున్న ప్రధాన ద్వారాన్ని ఇండో
ఇస్లామిక్ ఆర్కిటెక్ట్ శైలిలో నిర్మిస్తున్నారు. కళాతోరణాన్ని కాకతీయుల
నిర్మాణశైలికి అద్దంపట్టేలా నిర్మించనున్నారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ
షాన్‌గా పేరొందిన చారిత్రక కట్టడాల నిర్మాణాన్ని పోలి ఉండేలా నిర్మాణం
పైభాగం టూంబ్‌లతో ఏర్పాటు కానుంది. సెక్యూరిటీ రూం పేరుతో నిర్మిస్తున్న
ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఆరు గేట్లు నిర్మిస్తున్నారు.
పాదచారులతోపాటు, ద్విచక్ర వాహనాలు, ఇతర అధికారిక, అనధికారిక వాహనాలకోసం
ఇన్, అవుట్ గేట్లు ఉంటాయి. సచివాలయానికి వచ్చే సందర్శకులకు అనుమతి పత్రాలు
అందచేసే సెక్యూరిటీ అధికారుల వ్యవస్థ సెక్యూరిటీ రూంలో ఉంటుంది. ఈ ప్రధాన
ద్వారంకోసం రూ.40 లక్షలు కేటాయించారు. ప్రధాన ద్వారం తర్వాత కొద్దిదూరంలో
కాకతీయ కళాతోరణం నిర్మించనున్నారు. దాని మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం
ఏర్పాటు చేస్తారు.
No comments:
Post a Comment