Monday, 31 August 2015

రోజంతా కంప్యూటర్ ముందే కూర్చుంటున్నారా?

 

రోజంతా ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం, ఇంటికి వచ్చాక టీవీకి అతుక్కుపోవడం లేదా ల్యాప్ టాప్ ముందుకు కూర్చునే వారి సంఖ్య ఎక్కువే. అయితే ఈ విధంగా గంటల తరబడి కంప్యూటర్లు, టీవీల ముందు కూర్చోవడం వలన చిన్న వయసులోనే కళ్ల సమస్యలు ఏర్పడతాయి. కంప్యూటర్ నుంచి వెలువడే పవర్ వలన కళ్ల చూపు మందగించే ప్రమాదం ఉంది. కనుక కళ్ల కోసం కొంత టైమ్ కేటాయించాలి.

కళ్ల సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే కళ్లకు అప్పుడప్పుడు కాస్తంత విశ్రాంతిని ఇస్తూ, చిన్న పాట వ్యాయామాలు చేయడం మంచిది. అవి ఎలా చేయాలంటే. రెండు అరచేతుల్ని కలిపి రుద్దితే కొన్ని నిమిషాలకు వేడెక్కుతాయి. వాటిని కళ్లపై ఉంచండి. ఇలా చేస్తున్నప్పుడు కళ్లు తెరవకూడదు. కళ్లపై వెలుతురు పడకూడదు. ఇలా రోజులో కుదిరినప్పుడల్లా చేసి చూడండి. కళ్లకు హాయిగా అనిపిస్తుంది.

 

కంప్యూటరుపై పనిచేసే వారిలో చాలా మంచి కనీసం రెండు నిమిషాలు కూడా కళ్లు మూసి తెరవరు. దాంతో కళ్లు అలసిపోతుంటాయి. ఇలాంటి వారు తరచూ కనురెప్పల్ని మూసి తెరవడం ఓ అలవాటుగా మార్చుకోవాలి. ఇలా ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత మంచిది.

 

కంప్యూటరు ఎదురుగా కూర్చుని పనిచేసే వారు దూరంగా ఉండేవి చూడటంలో ఇబ్బందిపడతారు. దాన్ని అధిగమించాలంటే ప్రతి అర గంటకోసారి ఐదు సెకన్లు దూరంగా ఉండే వస్తువుల్ని చూడాలి. ఇది కళ్లకెంతో మేలు చేస్తుంది. ఇక కళ్లు బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంటే, కాసిని నీళ్లు జిలకరించుకోండి. లేదా చన్నీళ్లతో కళ్లను తుడుచుకోండి. దీన్ని కళ్లపై ఉన్న ఒత్తిడిపోయి తాజాగా మారతాయి.

 

సౌకర్యంగా కూర్చుని చేతి బొటనవేలిని కంటికెదురుగా పెట్టుకుని దాన్న చూడాలి. తరువాత వేలిని దూరంగా ఉంచి మళ్లీ దృష్టిని దానిపై నిలపాలి. ఇలా కొన్ని నిమిషాలు చేస్తే కళ్లకు విశ్రాంతి లభిస్తుంది. ఈ విధంగా చేయడం వలన కళ్ల చూపు సమస్యలు దరిచేరవని వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు.

No comments:

Post a Comment