తెలంగాణను పట్టించుకోండి: ఎంపీ వినోద్
కేంద్రం విభజన చట్టంలో ఎన్నో హామీలు పేర్కొన్నారని, వాటిపై కేంద్రం
స్పందించాలని తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కోరారు. తెలంగాణ
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం
చేశారు. కేంద్రం తెలంగాణను పట్టించుకోకపోతే మళ్ళీ ఆందోళన బాటపడతామని
స్పష్టం చేశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ సహా తెలంగాణకు చెందిన ఇతర
అంశాలపైనా కేంద్రం శ్రద్ధ వహించాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. ఏపీకి ఎలాంటి
కేటాయింపులు, రాయితీలు అందిస్తున్నారో, తెలంగాణకూ అదే రీతిలో అందించాలని
డిమాండ్ చేశారు. ఆంధ్రకు నిధులు కేటాయిస్తున్నారు, కానీ తెలంగాణకు ఎందుకు
కేటాయించడం లేదో చెప్పాలని అన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ బీజేపీకి
మద్దతు ఇచ్చిందనే కారణంతో ఆంధ్రకు నిధులు కేటాయిస్తున్నారని, తెలంగాణలో
టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వలేదనే కారణంతో తెలంగాణకు నిధులు
కేటాయించకపోవడం దారుణమాని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment