Wednesday, 26 August 2015

మూడు రోజులు ముద్దుల్లోనే..


ముంబై: ఇమ్రాన్ ఖాన్, కంగనా రనౌత్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కట్టి బట్టి. ఈ చిత్రంలోని ఓ పాట కొరకు మూడు రోజుల పాటు నాయకా నాయికలు ముద్దుల్లో మనిగిపోయారట. లిప్ టూ లిప్ కిస్సియాన్ అనే పాట చిత్రీకరణ సమయంలో ఇమ్రాన్, కంగనలు రోజుకు 8 గంటల చొప్పున మూడు రోజులు తమ పెదవులకు పని చెప్పారని సమాచారం.

ఈ పాట కొరకు స్టాప్ మోషన్ టెక్నాలజీని దేశంలోనే మొదటిసారిగా వాడినట్లు చిత్ర బృందం తెలిపింది. దేశంలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని ఉపయోగించి లిప్ టూ లిప్ కిస్సియాన్ పాటను అద్భుతంగా చిత్రించామని, ఈ పాటలో ఇమ్రాన్, కంగనలు లీనమైపోయి ఆడిపాడారని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ చిత్ర కథ సాగే కొద్ది అంతు బట్టని రహస్యంతో థ్రిల్లింగ్‌గా ఉంటుందని అంతర్లీనంగా పరిపక్వ ప్రేమను కూడా ఇందులో చొప్పించారని బాలీవుడ్ టాక్. ఇదో థ్రిల్లర్ మూవీ అని కంగనా ఇదివరకే చెప్పింది. గతంలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. నిఖిల్ అడ్వాణీ దర్శకత్వం వహిస్తున్న కట్టి బట్టి చిత్రం సెప్టెంబరు మూడో వారంలో ప్రేక్షకులను పలకరించనుంది.

No comments:

Post a Comment