TRS Party Has Done Varunayagam on Monday in Wanaparthy Mahabubnagar Dist
వనపర్తిలో వరుణయాగం
వనపర్తి, నమస్తే తెలంగాణ : మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం వర్షాలు కురువాలని వరుణయాగం చేశారు. కరువు పరిస్థితుల నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడాలని కోరుతూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆయన సతీమణి వాసంతిలు యాగంలో పాల్గొన్నారు. యుగ పరివర్తక మిషన్ వ్యవస్థాపకులు డాక్టర్ తుమ్మూరి వరుణయాగం చేయించారు. పట్టణానికి చెందిన 200 మంది దంపతులు వరుణయాగంలో పాల్గొన్నారు. ఉదయం 11.30గంటలకు శుభ ముహూర్తంలో యాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రుతుపవనాలతోపాటు, వర్షాలు కురియడానికి దేవుడి అనుగ్రహం కూడా ఉండాలని వరుణయాగం చేయించినట్లు ఆయన చెప్పారు.
గతంలో లేనివిధంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు ఆశించిన మేరకు కురువలేదన్నారు. దానికి కారణాలు ఏమైన ఉండవచ్చని, అందులో మానవ తప్పిదం ఉండి ఉంటుందని, వాటన్నింటిని అధిగమించడానికి వరుణయాగం చేపట్టడం జరిగిందన్నారు. వర్షాలు విరివిగా కురియడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం పథకాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు రవీంద్రకుమార్, టీఆర్‌ఎస్ నాయకులు లోక్‌నాథ్‌రెడ్డి, గట్టుయాదవ్, వాకిటిశ్రీధర్, లక్ష్మీనారాయణ, యోగానందరెడ్డి, తిలక్, నారాయణదాస్ కిట్టు, ప్రేమ్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment