Wednesday, 26 August 2015

Ami Jackson Is Going To Act Without Make up

Ami Jackson Is Going To Act Without Make up

శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో చక్కటి అభినయంతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అమీ జాక్సన్ ప్రస్తుతం తమిళ, హిందీ భాషల్లో బిజీగా వుంది.తమిళంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న వేళ ఇళ్ల పట్టాదారి-2 చిత్రంలో నటిస్తోంది. సమంతా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అమీ రెండవ నాయిక పాత్రను పోషిస్తోంది. ఇందులో ఆమె ఓ బ్రాహ్మణ యువతి పాత్రలో కనిపించనుందట. మూమూలుగానే పసిడి వర్ణంతో మెరిసిపోయే ఈ శ్వేత సుందరి ఈ సినిమాలో మేకప్ లేకుండానే నటిస్తోందని తమిళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఎప్పుడూ మోడ్రన్ కాస్ట్యూమ్స్‌లో కనిపించే ఈ సొగసరి దక్షిణ భారత వస్త్రధారణతో సంప్రదాయబద్ధంగా కనిపిస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

No comments:

Post a Comment