Thursday, 27 August 2015

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ కేసు 31కి వాయిదా

 

నిందితులు, సాక్షుల వాంగ్మూలం రికార్డు
చర్లపల్లి, ఆగస్టు 26: సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళ కేసు విచారణ వరుసగా మూడోరోజూ కొనసాగింది. బుధవారం కూడా చర్లపల్లి జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులో విచారణ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా 5వ అడిషనల్ మెట్రోపాలిటిన్ సెషన్స్‌జడ్జి సీహెచ్ శ్రీనివాస్‌రావు చర్లపల్లి జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులో నిందితులను విచారించారు. నిందితులు యాసిన్‌భత్కల్, అసదుల్లాఅక్తర్, జియావుర్‌రెహ్మాన్, తహసీన్‌అక్తర్, అజీజ్‌షేక్‌తోపాటు 12మంది సాక్షుల వాంగ్మూలం రికార్డు చేశారు. తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేశారు.

No comments:

Post a Comment