Wednesday, 26 August 2015

TV Gernalist Murdered In lIve


 

మోనెటా (అమెరికా), ఆగస్టు 26: అమెరికాలో తుపాకి సంస్కృతి పెరుగుతున్నదని విమర్శలు చెలరేగుతున్న తరుణంలోనే అమెరికాలో ఇద్దరు టెలివిజన్ జర్నలిస్టులను ఆగంతకులు దారుణంగా కాల్చి చంపారు. ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం నిర్వహిస్తున్న డబ్ల్యూబీజే-7 టెలివిజన్ ప్రతినిధులపై ఆగంతకులు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. వర్జీనియాలో బుధవారం ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. ఈ దుర్ఘటనలో రిపోర్టర్ అలిసన్ పార్కర్ (24), కెమెరామెన్ ఆడం వార్డ్ (27) మృత్యువాత పడ్డారని టెలివిజన్ మేనేజర్ జెఫరీ ఏ మార్క్ తెలిపారు. బెడ్‌ఫోర్డ్ కౌంటీలో ఉన్న బ్రిడ్జ్‌వాటర్ ప్లాజా, ఓ షాపింగ్, రిక్రియేషన్ ప్లాజాలో టూరిజానికి సంబంధించిన కార్యక్రమాన్ని చిత్రీకరిస్తుండగా ఆగంతకులు కాల్పులు జరిపినట్లు జెఫరీ తెలిపారు. కాల్పులకు బాధ్యులెవరో.. ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డారో అనే విషయంపై ఇంకా స్పష్టత లభించలేదన్నారు.
-అమెరికాలో దారుణం
-ఇంటర్వ్యూ చేస్తున్న రిపోర్టర్, కెమెరామెన్‌పై కాల్పులు
-ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలోనే ఘటన

ఓ వ్యక్తిని పార్కర్ నవ్వుతూ ఇంటర్వ్యూ చేస్తుండగా కాల్పుల శబ్దం వినిపించిందని, దాంతో భయాందోళనకు గురైన పార్కర్ కేకలు పెడుతూ ఓ మై గాడ్ అంటూ పరుగెత్తుతున్న దృశ్యాలు వీడియో ఫుటేజీలో కనిపించాయని జెఫరీ పేర్కొన్నారు. మృతులిద్దరికి ఈ మధ్యనే నిశ్చితార్థం జరిగింది. పెండ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో టెలివిజన్ సంస్థ సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. కాల్పుల సమయంలో కింద పడిన కెమెరాలో.. నల్లటి ప్యాంట్, బ్లూ షర్ట్ ధరించి తుపాకిని పట్టుకున్న షూటర్లకు సంబంధించిన అస్పష్టమైన చిత్రాలు రికార్డయ్యాయి. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

No comments:

Post a Comment