Wednesday, 26 August 2015

Tollywood Megastar Chiranjeevi Sacrifice 150 th Movie For His son Ram Charan Tej


 

చరణ్ కోసం తన 150వ సినిమా లెక్కని మెగాస్టార్ సరిపెట్టేస్తున్నాడు. మెగాస్టార్ రాకతో శీనువైట్ల-చరణ్ సినిమాకు కలెక్షన్లు భారీగా పెరుగుతాయని జోరుగా ప్రచారం సాగుతుంది. మగధీర సినిమాతో దర్శకుడు రాజమౌళి చరణ్ కు మంచి హిట్ ఇచ్చాడు. మగధీర సినిమా తర్వాత చరణ్ సినిమాలేవీ 50 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు. దాంతో తనయుడి కోసం చిరంజీవి రంగంలోకి దిగాడు. గతంలో తండ్రీ కొడుకులు నటించిన మగధీర.. ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసిన విషం అందరికి తెలిసిందే. శీనువైట్ల సినిమాతో ఇప్పుడూ అదే సీన్ రిపీట్ అవుతుందనే ఊహలో చిరు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చరణ్ మార్కెట్‌ను పెంచేందుకే తన 150వ సినిమాలా కాకుండా మెగాస్టార్ అతిథి రోల్‌తో సరిపెట్టుకున్నాడని ఫిలిమ్ నగర్ లో టాక్. బాహుబలి, శ్రీమంతుడు సినిమాలతో టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయిన నేపథ్యంలో.. చెర్రీ మంచి పేరు సంపాదించిపెట్టేందుకే చిరంజీవి తన 150వ సినిమాను త్యాగం చేశారని టాక్ ఫిలిం నగర్ లో హాల్ చల్ చేస్తోంది. మరి ఈ మెగా ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో వెచి చూడాల్సిందే మరీ..

No comments:

Post a Comment