ఎయిర్ హోస్టెస్ ను పట్టుకుని బుక్కయిన లా విద్యార్ధి
నల్సార్ న్యాయవిద్యాలయం విద్యార్ది ని శంసాబాద్ పోలీనసులు అరెస్టు చేశారు.
బెంగళూర్ నుంచి హైదరాబాద్ కు ఇండిగో విమానం లో వస్తున్న ప్రణవ్ అగర్వాల్
విమానంలో వున్న ఎయిర్ హోస్టెస్ ను పలుమార్లు అనుచితంగా ముట్టుకున్నాడు.
ప్రణవ్ చేష్టలను ఆమె మొదట లైట్ గా తీసుకుంది. దాంతో మరింత రెచ్చిపోయిన
ప్రణవ్ ఆమెను తన మోబైల్ ఫోన్ లో రహస్యంగా వీడియో తీయడం మొదలెట్టాడు. దాంతో
ఎయిర్ హోస్టెస్ గ్రౌండ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దాంతో శంషాబాద్ లో
విమానం దిగగానే పోలీసులు ప్రణవ్ ను ఆదుపులోకి తీసుకున్నారు.
No comments:
Post a Comment