Guide Of How To Prepare Your Exminations
ఏ పరీక్షకు ప్రిపేర్ కావాలి...?
సంఘర్షణ.. ఒక విషయంపై నిర్ణయం
తీసుకోవాల్సి వచ్చినప్పుడు సంఘర్షణ. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ నుంచి
నోటిఫికేషన్స్ రానున్న నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు ఏ పరీక్షను లక్ష్యం
చేసుకోవాలి? దేనికి ప్రిపేర్‌కావాలి అన్న అంశాలు తెలియక సంఘర్షణ
పడుతున్నారు. వీరిలో ఎక్కువమంది చాలా పరీక్షలకు కామన్‌గా ప్రిపేరవుతూ
దేనిలో సెలక్ట్ కాకుండా మిగిలిపోయిన అనుభవాలు ఉన్నా యి. మరి దేన్ని
టార్గెట్ చేసుకుంటే ఉద్యోగం మీ సొంతం అవుతుంది అన్న విషయంపై ప్రముఖ
సైకాలజిస్టుల సూచనలు మీ కోసం....
గణేష్, నిరంజన్ ఇద్దరు మిత్రులు.
వీరు డిగ్రీ, బీఎడ్, పీజీ చదివారు. గతంలో పలు పోటీ పరీక్షలను రాసి తృటిలో
ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయారు. ప్రస్తు తం గ్రూప్స్, ఎస్ఐ, డీఎస్సీ తదితర
నోటిఫికేషన్స్ రానున్ననేపథ్యంలో వేటికి ప్రిపేరవ్వాలో అర్థం కాక
సతమతమవుతున్నారు. కానీ ఇద్దరి అంతిమ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే.
సంఘర్షణ - మానసిక స్థితి

విద్యార్థి
తాను ఏర్పర్చుకున్న గమ్యం స్పష్టంగా, ఇష్టంగా ఉంటే సమస్యే లేదు. కానీ ఈ
స్పష్టత లోపించినా, అన్ని సమానంగా కన్పిస్తూ దేన్ని ఎంచుకోవాలో అర్థం కాని
సందర్భంలో ఆందోళన మొదలవుతుంది. దీంతో వ్యాకులత, చికాకు, ఏం చేయాలో తోచని
ఆయోమయస్థితి. ఏమీ చేయలేని నిస్సహాయత అనుభవిస్తాడు. ఈ సమస్య పరిష్కారమయ్యే
వరకు ఇదే స్థితి కొనసాగుతుంది.
ఈ సంఘర్షణలను మొదట్లో కుర్ట్ లెవిన్ అనే
సైకాలజిస్ట్ వివరించాడు. ఆ తర్వా త నెయిల్ మిల్లర్ అనే సైకాలజిస్ట్ ఈ
సంఘర్షణలపై విస్తృతంగా పరిశోధనలను చేశాడు. ఇతని పరిశోధనల ప్రకారం సంఘర్షణలు
మూడు రకాలు అవి..
1. approach- approach conflict
2. avoidance avoidance conflict
3. approach- avoidance conflict
approach- approach conflict
ఈ
సంఘర్షణలో వ్యక్తికి రెండు గమ్యాలు ఉంటాయి. ఆ రెండు అతనికి ఇష్టమే.
మొదట్లో అనుకున్నట్లు గణేష్‌కు గ్రూప్-2, డీఎస్సీ రెండూ రాయాలనేదే లక్ష్యం.
ఒక పరీక్షను టార్గెట్ చేసుకుంటే రెండో దాన్ని వదులుకోవాల్సిందే. అందుకే
రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవడానికి తంటాలు పడుతున్నాడు.
avoidance avoidance conflict
ఈ
సంఘర్షణలో రెండు గోల్స్ ఉంటాయి. కానీ ఈ రెండింటిలో అతనికి ఏదీ ఇష్టముండదు.
తనకు ఇష్టం లేకున్నా రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. పైన చెప్పుకున్న
ఇద్దరు మంచి శారీరక దృఢత్వాన్ని కలిగి ఉన్నారు. వీరికి పోలీస్
డిపార్ట్మెంట్ పోస్టులకు అర్హత ఉంది. కానీ ఆ ఉద్యోగాలు ఇష్టం లేదు.
ప్రిపేర్ అయి రాస్తే తప్పనిసరిగా జాబ్ వస్తుంది. దీంతో జీవితంలో స్థిరపడే
చాన్స్. కుటుంబ పరిస్థితి ప్రకారం ఏదో ఒక జాబ్ వస్తే తర్వాత వేరేదాని
గురించి చూద్దామన్నట్లు ఉంది. కానిస్టేబుల్, ఎస్ఐ నోటిఫికేషన్స్ రెండూ
ఇష్టం లేవు.
approach- avoidance conflict
ఈ
సంఘర్షణలో విద్యార్థికి ఒకటే గమ్యం ఉంటుంది. ఆ గమ్యం అతన్ని
ఆకర్షిస్తుంది. కానీ అదే అతన్ని భయపెడుతుంది. ఉదాహరణకు పోలీస్ జాబ్. పై
ఇద్దరు విద్యార్థులు మంచి అర్హతలు కలిగి ఉండి, గ్రూప్స్ ప్రిపేర్ అయిన
నాలెడ్జ్ ఉండటంతో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను సులభంగా సాధించగలరు. కానీ ఆ
ఉద్యోగ విధులు నిర్వర్తించాలంటే భయపడుతున్నారు. 24 గంటల డ్యూటీ. అమ్మో!
మేము చేయగలమా..? అనే భయం. నైల్ మిల్లర్ అభిప్రాయం ప్రకా రం ఇలాంటి
సంఘర్షణలో విద్యార్థి నెగెటివ్ పాయింట్స్‌కు తక్కువ, పాజిటివ్ పాయింట్స్‌కు
ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడు సమస్య సులువుగా సాల్వ్ అవుతుంది.
ప్రతి
విద్యార్థికి ఎన్నో రకాల సమస్యలుంటాయి. ఈ సమస్యల పరిష్కారంలో విద్యార్థి
తీసుకునే నిర్ణయంపైనే అతని భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. నిర్ణయం సరైనది అయితే
బంగారు భవిష్యత్ లేకుంటే.. అంధకారంలో ఉంటుంది. సంఘర్షణలు సాల్వ్ చేయడంలో
కొందరు విద్యార్థులు అపసవ్య నిర్ణయాలు తీసుకొంటారు. ఇది వారి జీవితాలకు
శాపంగా మారే అవకాశం ఉంది. లియోన్మాన్, జనీస్ వంటి ప్రముఖ సైకాలజిస్ట్‌లు
సంఘర్షణల పరిష్కారానికి విద్యార్థులు తీసుకొనే నిర్ణయాలపై పరిశోధనలను
చేశారు.
వాటిని సూక్ష్మంగా పరిశీలిద్దాం...
డిఫెన్స్
అవాయిడెన్స్: సాధారణంగా ఎక్కువమంది విద్యార్థులు సమస్యలు ఎదురైనప్పుడు
ఉపయోగించే పద్ధతి ఇదే. దీనిలో ఒక నిర్ణయం తీసుకోకుండా నిర్లప్తంగా ఉండటం,
సమస్యను వాయిదా వేయడం లేదా సమస్యను పరిష్కరించే బాధ్యత వేరే వారికి
వదిలివేయడం. దీంతో కాలం కాస్తా అయిపోయి చివరకు అంతిమ లక్ష్యం చేరుకోలేరు.
హైపర్
విజిలెన్స్: సంఘర్షణ ఎదురైతేనే కొందరు ఆందోళన పడుతుంటారు. వీరు గుడ్డిగా,
ఏదీ ఆలోచించకుండా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం సరైనదా ? కాదా ? అని
ఆలోచించే స్థితిలో వారు ఉండరు.
unconflicted adherence: ఈ
స్థితిలో ఒక సమస్యను రిజాల్వ్ చేయడానికి మనం నమ్ముకున్న వాళ్లను అడిగి
తెలుసుకుంటారు. నిపుణుల, సీనియర్స్ సలహాలను సూచనలను తీసుకుంటారు. దీనిలో
చాలామంది గతంలో చేసిన విధంగానే ముందుకు పోతూ ఉంటారు. దీనిలో ఫలితాల గురించి
ఆలోచించరు.
unconflicted change: ఈ స్థితిలో ఉన్నవారు ఎవరో ఒకరు
ఇచ్చిన సలహాలను పాటిస్తారు. దానితో ఉపయోగం ఉందా? లేదా అని ఆలోచించరు.
ఇటువంటి వాటితో సమస్య మరింత జటిలం అవుతుంది.
సమస్య సాధనకు ఏం చేయాలి...?
సంఘర్షణలను
పరిష్కరించడానికి కాగ్నిటివ్ సైకాలజీ ఒక సింపుల్ పద్ధతిని సూచించింది. ఈ
ప్రయత్నంలో విద్యార్థి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకోగల
పెద్దలతో చర్చించి అవగాహన చేసుకోవాలి.
-ఆ తర్వాతమొదటి గమ్యంలోని పాజిటివ్, నెగెటివ్ పాయింట్స్‌ను రాసుకోవాలి.
-రెండో గమ్యంలోని మంచి, చెడులను పాయింట్స్‌గా నోట్ చేసుకోవాలి.
-రెండు గమ్యాల్లో పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నదానిని ఎంచుకోవాలి.
-ఈ పద్ధతినే బ్యాలెన్స్ షీట్ మెథడ్ అంటారు.
For Get Update News Please Follow our Facebook page
ReplyDelete