Saturday, 22 August 2015

Naga Babu Said GO and Ask To Pavan

 Naga Babu Said GO and Ask To Pavan








మెగాస్టార్ చిరంజీవి 60పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం రాత్రి హైదరాబాద్ ‘శిల్పకళా వేదిక’లో వేడుకలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో అభిమానుల తరలివచ్చారు. వారి సమక్షంలో కేక్ కట్ చేసిన చిరంజీవి, వాళ్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. వేదికపై అల్లు అరవింద్ తో పాటు నాగేంద్రబాబు, చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఉంది. కానీ ఎప్పటిలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం అక్కడ లేదు. దాంతో పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదంటూ అభిమానులు గోల చేయడం మొదలు పెట్టారు. పవన్ పవన్ అంటే నినాదాలతో హోరెత్తించారు. ఈ విషయమై గతంలో సర్దిచెబుతూ వచ్చిన నాగేంద్రబాబు..ఈసారి మాత్రం సీరియస్ అయ్యారు. ఒక్క సారిగా ఆయనకు కోపం వచ్చింది .
ప్రతిసారి పవన్ కల్యాణ్ ప్రస్తావన తెస్తూ గొడవ చేయడం మంచిది కాదని ఆయన అభిమానులకు హితవు పలికారు. ప్రతిసారీ పిలుస్తున్నా ఆయన రావడం లేదు .. దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? ఆయన్ని ఎన్ని సార్లు పిలిచామో మీకు తెలుసా ..? పవన్ గురించి ఇక్కడ అరవడం కాదు .. వెళ్లండి .. ఆయన ఇంటికి వెళ్లి ఎందుకు రాలేదని అడగండి! అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే నాగబాబు.. ఒక్కసారిగా ఇలా ఫైర్ కావడంతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. పవన్ రాలేదనే బాధ మెగా ఫ్యామిలీకి కూడా ఉందనేది నాగబాబు మాటలతో ఫ్యాన్స్ కు అర్థమైంది. నాగబాబు సీరియస్ కావడంతో.. కాసేపు అక్కడ వాతావరణం సైలెంట్ అయింది. ఆ తర్వాత యథావిథిగా వేడుకలు జరిగాయి.

No comments:

Post a Comment