Train Accident In Anantapur One Died
Train Accident In Anantapur One Died

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో ఈ రోజు ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది.
మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో
ఆరుగురు మరణించారు. గ్రానైట్‌తో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి మడకశిర
లెవెల్ క్రాసింగ్ వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్ హెచ్1 బోగిని
ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్రానైట్ రాయి రైలు బోగిపై పడిపోయి దెబ్బతింది. ఈ
సంఘటనలో మరో రెండు బోగీలు పక్కకు పడిపోయాయి. లారీ డ్రైవరు ఆసుపత్రిలో
చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో హెచ్1 బోగి ఏసీ టెక్నిషియన్
అహ్మద్, కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ్ ఎమ్మెల్యే
వెంకటేష్‌నాయక్‌లు ఉన్నారు. ఈ ప్రమాదం ఉదయం 2.30 గంటలకు జరిగింది. సమాచారం
అందుకున్న వెంటనే రెస్క్యూ టీంలు ప్రమాద స్థలానికి చేరుకోని సహయ చర్యలు
చెపట్టారు. ఈ ప్రమాదం కారణంగా బెంగళూరు- గుంతకల్లు మార్గంలో రైళ్ల
రాకపోకలకు అంతరాయం కలిగింది. షోలాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను కల్లూరులో. ముంబయి-
బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ను తాడిచెర్లలో, బీదర్-యశ్వంత్‌పూర్
రైలును గార్లదిన్నెలో, నిజాముద్దీన్- బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను
అనంతపురంలో నిలిపివేశారు. రైల్వే అధికారులు వచ్చి రైళ్ల రాకపోకలను
పునరుద్ధరించనున్నారు.
No comments:
Post a Comment