Bathkal Interrogation Only In Jail in Hyderabad
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాని నిందితుడు యాసిన్ భత్కల్
తోపాటు మరో నలుగుర్ని చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రత్యేకంగా ఏర్పాటు
చేసిన కోర్టులో విచారించారు. రెండు రోజుల విచారణలో భాగంగా రంగారెడ్డి
జిల్లా 5వ అడిషనల్ మెట్రోపాలిటిన్ సెషన్ జడ్జి సీహెచ్ శ్రీనివాస్‌రావు ఎదుట
నిందితులను జైలు అధికారులు హాజరుపరిచారు. భద్రతా కారణాల వల్ల నిందితులను
చర్లపల్లి జైలులోనే విచారించాలని పోలీసుశాఖ నిర్ణయం తీసుకొన్న సంగతి
తెలిసిందే. విచారణ సందర్భంగా చర్లపల్లి జైలు పరిసర ప్రాంతాల్లో
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాసిన్ భత్కల్, మరో నలుగురు
నిందితులు అసదుల్లా అక్తర్, జియా ఉర్ రహ్మాన్, తహాసిన్ అక్తర్,
అజీజ్‌షేక్‌లతోపాటు కేసుకు సంబంధించి 12మంది సాక్షులను విచారించి వారి
వాంగ్మూలాలను రికార్డు చేశారు.
No comments:
Post a Comment