Tuesday, 25 August 2015

Terrorist Blasted Bombs In Hyderabad 8 Years Ago

Terrorist Blasted Bombs In Hyderabad  8 Years Ago

 


హైదరాబాద్ లో ఉగ్రవాదులు గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో పేలుళ్లు జరిపి నేటికి సరిగ్గా ఎనిమిదేళ్లు. ప్రశాంతంగా ఉండే భాగ్యనగరం ఈ పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు విసిరిన పంజా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలైన లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లో పేలుళ్లు జరిగాయి. ఆ రెండు ఘటనల్లో 42 మంది చనిపోగా..వందలాది మంది గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి.. దిక్కుతోచని స్థితికి చేరుకున్నాయి. గాయపడ్డవారిలో కొందరు ఇప్పటికీ జీవశ్చవాలుగా బతుకీడుస్తున్నారు. వారికి నేటికీ ప్రభుత్వ సాయం అందలేదు.
పేలుళ్లు జరిగాక ఏం జరిగిందో తెలుసుకునే లోపే అనేక మంది రక్తపు మడుగులో పడిఉన్నారు. తెగిపడ్డ అవయవాలు, రక్తమోడుతున్న శరీరాలు, కాల్వలు కట్టిన రక్తపు ధారలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ప్రాణాలతో బయటపడ్డ సందర్శకులంతా భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలోనూ కొందరికి కాళ్లు, చేతులు విరిగాయి. పేలుడు ధాటికి గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరి కొందరు మృతి చెందారు. లుంబిని పార్క్ లో పేలుడు జరిగిన కొద్ది క్షణాల్లోనే గోకుల్ చాట్ లో మరో పేలుడు జరిగింది. 7 గంటల 40 నిమిషాల సమయంలో జరిగిన ఈ పేలుడుతో మొత్తం 42 మంది మృతి చెందారు. 72 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్న వారు ఇప్పటికీ.. ఆ చేదు జ్ఞాపకాన్ని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు.

No comments:

Post a Comment