Tuesday, 25 August 2015

Bharath Coking Coal Jobs For Technician, Physiotherapist, pharmacist and Accountant

Bharath Coking Coal Jobs For Technician, Physiotherapist, pharmacist and Accountant 2015 భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ ధన్‌బాద్‌లో ఉన్నాది. ఈ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్, జూనియర్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, ఫార్మాసిస్ట్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య: 248 పోస్టులు పోస్టు పేరు: స్టాఫ్ నర్స్ ట్రెయినీ- 91 పోస్టులు అర్హత: ఇంటర్మీడియెట్, గ్రేడ్-ఏ నర్సింగ్ డిప్లొమా/తత్సమాన సర్టిఫికెట్ పరీక్షలో ఉత్తీర్ణత. జూనియర్ టెక్నీషియన్: 30 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్మీడియెట్, ఈసీజీ టెక్నీషియన్ రెండేండ్ల అనుభవం ఉండాలి. డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. టెక్నీషియన్ ట్రెయినీ: 82 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్మీడియెట్, డిప్లొమా ఇన్ అడియోమెట్రీ, ఆప్టోమెట్రీ, డెంటల్, డైటీషియన్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నాలజీలో ఉత్తీర్ణత/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఫిజియోథెరపిస్ట్: 6 పోస్టులు అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి డిప్లొమా ఇన్ ఫిజియోథెరపిలో ఉత్తీర్ణత ఫార్మాసిస్ట్: 25 పోస్టులు అర్హత: సైన్స్ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్, డిప్లొమా ఇన్ ఫార్మసీలో ఉత్తీర్ణత అకౌంటెంట్: 14 పోస్టులు అర్హత: ఐసీడబ్ల్యూఏ/సీఏతో ఇంటర్మీడియెట్ వయస్సు: పైన పేర్కొన్న పొస్టులన్నింటికీ 2015, సెప్టెంబర్ 14 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు: రూ. 200 ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ప్రొఫెషనల్ ఆప్టిట్యూడ్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో జనరల్ అవేర్‌నేస్, పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. దరఖాస్తు చివరితేదీ : సెప్టెంబర్ 17 , అప్లై ఆన్‌లైన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: www.bccl.gov.in

No comments:

Post a Comment