Tuesday, 25 August 2015

Scholaships For Inteligent and Poor Students of North And South

Scholaships For Inteligent and Poor Students of  North And South

తెలివితేట‌లు ఉండి చ‌దువుకోవ‌డం ఆర్థికంగా భారమైన పేద‌విద్యార్థుల‌ను ఆదుకోవ‌డానికి నేనున్నానంటోంది నార్త్ సౌత్ ఫౌండేష‌న్‌. యూఎస్ ప్రధాన కేంద్రంగా ఏర్పడిన ఈ సంస్థ కుల‌, మ‌త‌, వ‌ర్గ, ప్రాంత‌, లింగ బేధం లేకుండా ఆర్థికంగా వెనుక‌బ‌డిన చురుకైన విద్యార్థులకు చేయూత‌నందిస్తోంది. ఇందుకోసం దేశ‌వ్యాప్తంగా ప్రతిభావంతులైన 3000 మంది పేద‌విద్యార్థుల‌ను ఆదుకోవ‌డానికి నార్త్ సౌత్ ఫౌండేష‌న్ ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. అక‌డ‌మిక్ ప‌రీక్షల్లో చూపిన ప్రతిభ ద్వారా అర్హులైన అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.

అర్హత‌:
అభ్యర్థులు ప‌దోత‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ ప‌రీక్షల ఫ‌లితాల్లో టాప్ 10 శాతంలో ఉండాలి. అలాగే వాళ్లిప్పుడు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, డెంటిస్ట్రీ, వెట‌ర్నరీ, ఫార్మసీ, అగ్రిక‌ల్చర్‌లో ప్రొఫెష‌న‌ల్ కోర్సులు లేదా ప్రభుత్వ/ ఎయిడెడ్ క‌ళాశాలల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి. అలాగే ఆ విద్యార్థుల త‌ల్లిదండ్రుల వార్షికాదాయం రూ.80 వేల‌లోపు ఉండాలి. దీంతోపాటు ఇత‌ర ఏ స్కాల‌ర్‌షిప్పుల‌నూ పొంద‌నివారై ఉండాలి. ఇలాంటివారికి మొద‌టి ప్రాధాన్యమిస్తారు.

ఎంపిక ఇలా:
వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్లో అర్హులైన‌వారిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఈ విద్యార్థుల‌ను, వాళ్ల త‌ల్లిదండ్రుల‌ను ఇంట‌ర్వ్యూకి ఆహ్వానిస్తారు. అన్నివిధాలా అర్హులేన‌ని నిర్వహ‌కులు భావిస్తే అలాంటి విద్యార్థుల‌ను స్కాల‌ర్‌షిప్పుకి ఎంపిక‌చేస్తారు.
ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్లో చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.northsouth.org/app6/Registration.aspx
ఆన్‌లైన్‌లో వివ‌రాలు రిజిస్టర్ చేసుకున్నత‌ర్వాత ప్రింట‌వుట్ తీసుకోవాలి. దానికి అవ‌స‌ర‌మైన ఇత‌ర డాక్యుమెంట్లను జ‌త‌చేసి కింది చిరునామాకి పంపాలి.

తెలంగాణ విద్యార్థులైతే: డి. సీతారామ‌య్య, రూమ్ నంబ‌ర్ 219-220, 2వ అంత‌స్తు, మోడ‌ల్ హౌస్‌, పంజాగుట్ట, హైద‌రాబాద్‌, తెలంగాణ రాష్ట్రం, పిన్‌:500082 (ఫోన్ నంబ‌ర్‌: 040-23356368)

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైతే: చిట్టూరి ప్రసాద్ చౌద‌రి, డోర్ నెంబ‌ర్ 33-7-10, సూర్యాల‌యం వీధి, త‌ణుకు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌, పిన్‌: 534211 (మొబైల్ నంబ‌ర్ 9959056004)
ద‌ర‌ఖాస్తులు చేర‌డానికి చివ‌రి తేదీ: సెప్టెంబ‌ర్ 5.

 

Last Date September 5th

website : CLICK HERE

No comments:

Post a Comment